టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఇమేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరు కూడా ఎక్కువ శాతం మాస్ , కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఒకే జోనర్ సినిమాలలో నటించి ఇండస్ట్రీ హిట్ లను కూడా అందుకున్నారు. ఆ సినిమాలేవి అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బి గోపాల్ దర్శకత్వంలో సమర సింహా రెడ్డి అనే సినిమా లో హీరో గా నటించాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సూపర్ సాలిడ్ టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , బి గోపాల్ కాంబో లో నరసింహ నాయుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఇక ఈ సినిమా కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రెండు సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. 

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి , బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఇంద్ర మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు కూడా బి గోపాల్ దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ తన కెరీర్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లను అందుకోగా , చిరంజీవి ఇంద్ర అనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ తో ఇండస్ట్రీ హిట్ నీ అందుకున్నాడు. ఇకపోతే ఈ మూడు సినిమాలకు కూడా బి గోపాల్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: