ఎప్పుడైనా సరే సాధారణంగా మగవాళ్ళు ఆడవాళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాలను మనం వింటూ ఉంటాం.. కానీ మహిళలు మాత్రం మరో మహిళ పైన కాస్త అసభ్యకరంగా మాట్లాడరు.. ఈ వ్యాఖ్యలు చాలా అరుదుగా మనం వింటూనే ఉంటాము. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ బ్యూటీ గా పేరు పొందిన నటి రేఖా నాయక్ ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాలను చిక్కుకుంటోంది. రేఖా నాయర్ తమిళంలో పలు సీరియల్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొన్నది. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడిన మాటలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.


నటి రేఖా నాయర్ ను.. ఇప్పుడు అమ్మాయిలు పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడం వల్ల అబ్బాయిలు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సమయంలో మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగగా.. దీనిపైన రేఖ నాయర్ ఇలా స్పందిస్తూ అబ్బాయిలు అమ్మాయిల తుంటిపై చేయి పెట్టినప్పుడు ఆనందించాలి కానీ ఏదో విషాదం జరిగినట్లుగా ప్రవర్తించకూడదు..చాలామంది అమ్మాయిలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ తెలిపింది.. చీర కట్టుకుంటే నడుము చూపిస్తారని కొంతమంది డ్రెస్సులు వేసుకుంటున్నారు కానీ తాను ఏ డ్రస్సు వేసుకున్న నడుము కనిపిస్తుంది అని తెలిపింది.


అబ్బాయిలు తన నడుము పైన చెయ్యి వేస్తే తనకసలు కోపం రాదని ఆనందాన్ని ఆస్వాదిస్తానంటూ తెలిపింది నటి రేఖా నాయర్.. బస్సులలో అబ్బాయిలు ఇలా చేసిన కూడా ఎలాంటి ఫీలింగు ఉండదు మహిళలు తమ ఆలోచనలను మార్చుకోవాల్సి ఉంటుంది అంటూ రేఖా నాయకర్ ఇలా వ్యాఖ్యలు చేయడం జరిగింది.. చాలామంది ఆడవాళ్లు కూడా అందం చూపించేలా దుస్తులు వేసుకుంటూ ఉంటారు.. అమ్మాయిల దుస్తులను కేవలం అబ్బాయిలు మాత్రమే మెచ్చుకుంటారు.. వారు మెచ్చుకోకపోతే ఆ దుస్తులు పనికిరావు అంటూ రేఖా నాయర్ తన అభిప్రాయంగా వెల్లడించింది.. అయితే ఈ నటి మాట్లాడిన వ్యాఖ్యలు కొంతమంది సమర్థిస్తూ ఉండగా మరి కొంతమంది వ్యతిరేకిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: