ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పై జగన్ ఫాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ అయిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలుకి కూడా వెళ్లారు. అనంతరం మద్యంతర బెయిల్ ద్వారా ఆయన విడుదలై ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా అభిమానులు, సినీ ప్రముఖులు జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించారు.
అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. అప్పుడు మెగా ఫ్యామిలీకి దూరం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జైలుకి వెళ్లి వచ్చాక అల్లు అర్జున్ ఒక్కొక్కరిని కలుస్తున్నాడు. తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి మామ మెగా స్టార్ చిరంజీవి, అలాగే నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు. ఇక మిగిలింది పవన్ ఒక్కడే, ఇక అల్లు అర్జున్ పవర్ స్టార్ ని కూడా కలిస్తే వారి కుటుంబంలో జరిగే గొడవలకు శుభం కార్డు పడ్డట్టే అని అభిమానులు అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్బంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి అరెస్టు చేయడం తప్పని మండిపడ్డారు. ఇక వైసీపీ ఎంపీ అల్లు అర్జున్ తరపున కోర్టులో వాదించాడు. జగన్ చెప్పడం వల్లనే వైసీపీ ఎంపీ, లాయర్ కోర్టులో బన్నీ తరపున వాదించాడు అనే రూమర్ ఉంది. దీంతో 'నీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా... దయచేసి ఇలాగే బెంగళూరు వచ్చి మా జగనన్నను కలువు' అంటూ ఎక్స్  వేదికగా జగన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. 'అన్నా, వీడు నిన్ను కలవకుంటే వీడిని గుర్తుపెట్టుకుందాం. మనమెంటో 2029 లో గెలిచి చూపిద్దాం' అని రాసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ జగన్ ని కలుస్తాడా.. లేక పవన్ ని కలుస్తాడా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: