అయినా సరే అల్లు అర్జున్ అలా సపోర్ట్ చేయడం అందరికీ హర్టింగ్గా అనిపించిందని వార్తలు వినిపించాయి . ఆ తర్వాత అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోయాడు . పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేలా చేసాడు. దీనితో చిరంజీవి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతూ ఫ్యామిలీ ఫంక్షన్ ని ఏర్పాటు చేశారు . అయితే ఆ ఫంక్షన్ లో కూడా అల్లు అర్జున్ ఎక్కడ కనిపించలేదు . పుష్ప2 ప్రమోషన్స్ ని కూడా మెగా హీరోలు ఎవరూ పట్టించుకోలేదు . ఏ సినిమా కోసం అయినా సరే బాగా రివ్యూ ఇచ్చే చిరంజీవి పుష్ప2 సినిమా రిలీజ్ అయిన సరే రివ్యూ ఇవ్వకుండా సైలెంట్ గా అయిపోయారు .
దీంత వీళ్ళ మధ్య వార్ కన్ఫామ్ అయిపోయింది . అయితే ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించడం కోసం మెగాస్టార్ తన స్టేటస్ అంతా ఉపయోగించి నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చేలా చేసాడు . దీంతో అల్లు అర్జున్ - స్నేహా రెడ్డినే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా నాగబాబు ఇంటికి వెళ్లి మరీ థాంక్స్ చెప్పారు . దీంతో ఇప్పుడు అందరి కళ్ళు గేమ్ చేంజర్ సినిమాపై పడ్డాయి .
పుష్ప 2 సినిమా విషయంలో మెగా వర్సెస్ అల్లు వారు బాగా గట్టిగా జరిగింది. ఆ కారణంగా మెగా ఫాన్స్ పుష్ప2 ని అడ్డుకుంటా, అంటూ చెప్పారు . అయితే ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు . ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమాపై ఉంటుందా..? ఉండదా..? అనేది అందరికీ ప్రశ్నర్థికంగా మారింది . కొంతమంది పైకి చెప్పకపోయినా బన్నీ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ విషయంలో నెగిటివ్ గానే ఉంటారు అంటుంటే ..మరికొందరు మాత్రం అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటూ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కలిసి పోయారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ కి ఆల్ రూట్స్ క్లియర్ అయినట్లే కనిపిస్తున్నాయి..!