నిఖిల్ మలియక్కల్ మైసూరులో జన్మించాడు. అతని తల్లి సహజంగా నటి, తండ్రి జర్నలిస్ట్ కావడంతో చిన్నప్పటినుండి నిఖిల్ కి కళలపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే డాన్స్, ఫైట్స్, నటన పట్ల ఆసక్తి కనబరిచాడు. ఈ క్రమంలోనే చేస్తున్న ఉద్యోగం కూడా మధ్యలోనే వదిలేసాడు. ఆ తరువాత 2016లో "ఊటీ" అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తరువాత క్రమంలో అనేక సీరియల్స్ లో కూడా నటించి మెప్పించాడు. స్టార్ మాలో వచ్చిన గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్ తో తెలుగువారికి కూడా నిఖిల్ బాగా దగ్గరయ్యాడు. దాంతో తెలుగు బుల్లితెర బిగ్ బాస్ ప్రేక్షకులు సైతం నిఖిల్ ని ఓన్ చేసుకున్నారు.
ఇకపోతే, మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షోలో పాల్గొనగా, ఫినాలేకి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు మాత్రమే ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఇక ఆఖరికి నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య పోరు జరగడంతో నిఖిల్ విజేతగా, గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. కాగా విజేత నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడు. సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన నిఖిల్.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మరో మెట్టు ఎక్కాడనే చెప్పుకోవచ్చు. ఇక రన్నరప్‌గా నిలిచిన గౌతమ్.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడనుకున్న గౌతమ్.. తిరిగి టైటిల్ రేస్‌లో నిలిచి నిఖిల్‌కు చెమటలు పట్టించడంతో పాటు చివరి వరకూ గట్టి పోటీనిచ్చాడు.