నిఖిల్ మొత్తం రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారును బహుమతిగా పొందాడు. అయితే సర్వేలు ఏం చెబుతున్నాయంటే... బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకూ ఓటీటీ కలిపి ఏ సీజన్‌లో కూడా.. ప్రైజ్ మనీ రూ.50 లక్షలకు మించి ఎవరికీ ఇవ్వలేదు. అయితే తొలిసారిగా రూ.55 లక్షల ప్రైజ్ మనీ అందుకోవడంతో నిఖిల్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఏదీ ఊరికే రాదు.. కష్టపడి సంపాదించుకోవాలని చెప్పిన బిగ్ బాస్.. రేషన్‌తో పాటు ప్రైజ్ మనీ కూడా గెలిచిన టాస్క్‌లను బట్టే ఈ మొత్తం పెరిగిందని చెప్పుకొచ్చాడు. దానిలో భాగంగానే ఎన్ని టాస్క్‌లలో గెలిస్తే అంత ప్రైజ్ మనీ పెరుగుతుందని చెప్పారు. అలా హౌస్‌లో ఉన్న మొత్తం 22 కంటెస్టెంట్స్ ఆడి సంపాదించినదే ఆ రూ.55 లక్షల ప్రైజ్ మనీ కావడం విశేషం.
అయితే నిఖిల్ మొత్తానికి ఈ రూ.55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు కానీ.. అతనికి దక్కేది మాత్రం కేవలం రూ.20-25 లక్షలు మాత్రమే. మిగిలిన రూ.30 లక్షలు జీఎస్టీ ద్వారా గవర్నమెంట్ అకౌంట్స్ లోకి టాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. గత సీజన్లలో కూడా ఇదే జరిగింది. ఇక్కడ ఎవ్వరూ గెలిచినా దాదాపు 50% కంటే కూడా ఎక్కువగా టాక్స్ రూపంలో కట్ అయిపోతుంది. కాగా రూ.55 లక్షలంటే చిన్న అమౌంట్ కాదు కాబట్టి లైఫ్ సెట్ అని అంతా అనుకుంటారు. కానీ ఈ ప్రైజ్ మనీలో భారీ కోత పడడంతో నిఖిల్‌కి దక్కేది కేవలం రూ.20 లక్షలు మాత్రమే మిగులుతుంది. మొదట్లో శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌లు విన్నర్ అయినప్పుడు ప్రైజ్ మనీ రూ.50 లక్షలు అయితే.. అందులో టాక్స్ రూ.10 లక్షలు మినహాయిస్తే దాదాపు రూ.40 లక్షలు వరకూ మిగిలేవి. కానీ.. రాను రాను టాక్స్ మార్జిన్ పెరగడం వలన, అదే విధంగా జీఎస్టీ యాడ్ కావడంతో విన్నర్ ప్రైజ్ మనీలో దాదాపు 50% కంటే ఎక్కువగా టాక్స్ రూపంలోనే పోతుంది. దీనిపై చాలామంది పెదవి విరుస్తున్నారు.