దర్శకుల విషయంలో భాషతో సంబంధం లేకుండా సినిమాలుకు కమిట్ అవుతున్నారు .. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 లో నటిస్తున్నాడు .. యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. అలాగే వచ్చే ఏడాది మరో యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. అలాగే కోలీవుడ్ సంచలన దర్శకులు అట్లీ, వెట్రీమారన్ తో సైతం ఎన్టీఆర్ సినిమాలు చేయబోతున్నాడు.. వెట్రీమారన్‌తో త్వరలోనే ఓ సినిమా పట్టాలకే అవకాశం ఉంది .. దేవర ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ వెట్రీమారన్‌తో సినిమా చేయాలని ఉన్నట్లు ప్రకటించాడు.
అలాగే జవాన్ తో పాన్ ఇండియాలో సంచలన విజయం అందుకున్న అట్లీ సైతం ఎన్టీఆర్‌తో సినిమా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే తెలుగు దర్శకులతో ఎన్నో సినిమాలు చేశారు.. ఇలా తెలుగు హింది , తమిళం , కన్నడ డైరెక్టర్లు అందరినీ ఎన్టీఆర్ చుట్టేస్తున్నారు.. ప్రస్తుతం మలయాళం ఒకటే మిగిలి ఉం ది... ఎన్టీఆర్ ను స్టోరీ తో మెప్పించగలిగితే వాళ్లకు అవకాశం లేకపోలేదు .. అవార్డు సాధించిన దర్శకులు అంతా అక్కడే ఉన్నారు వాళ్ళ కథలని కాస్త కమర్షియల్ ఫార్మాట్లోకి మార్చగలిగితే పాన్ ఇండియాలో అన్ని సంచలనాన్ని నమోదు అవుతాయి. దర్శకులకు ఎన్టీఆర్ అవకాశాలు ఇవ్వడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.