క‌న్న‌డంలో స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న ఉపేంద్ర‌...రాజ‌శేఖ‌ర్ ఓంకారంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క‌న్న‌డంలో స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఆ త‌ర్వాత హీరోగా మారాడు. క‌న్న‌డంతో పాటు తెలుగులో క‌న్యాదానం, రా, ఒకే మాట‌, నీతోనే ఉంటాను సినిమాల్లో హీరోగా న‌టించాడు. అల్లు అర్జున్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, వ‌రుణ్ తేజ్ గ‌ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.ఇదిలావుండగా నటుడు ఉపేంద్ర యూఐ మూవీని ప్రమోట్ చేసుకునేందుకు హైద్రాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ, ఉప్పెన గురించి, బుచ్చిబాబు గురించి, చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తెలుగు ఆడియెన్స్ తనను ఎంతగానో ఆదరిస్తుంటారని చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాను తెలుగు ఆడియెన్స్ డీ కోడ్ చేస్తారనే నమ్మకం తనకి ఉందని అన్నాడు.అయితే ఇప్పుడు యూఐ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాడు. డిసెంబర్ 20న ఈ చిత్రం రాబోతోంది.

ఈ క్రమంలో హైద్రాబాద్‌లో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ క్రమంలో ఆయన చిరంజీవి గురించి ఏం చెప్పాడంటే.1995-96 సమయంలో అనుకుంటా.. చిరంజీవితో కలిసి సినిమా తీయాలని ఏడాదికి పైగా ఆయనతో ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకుని, ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను..రెండేళ్లు అయ్యాక కానీ, నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. టాలీవుడ్‌లో ఒక్కో సీన్‌ని, ఒక్కో డైలాగును 100 సార్లు మారుస్తారు. ఏది బాగుంటుంది, జనాలకు ఏది నచ్చుతుందని ఆలోచించి, మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు..మెగాస్టార్ అంటే పాటలు డాన్స్ ఫైట్ అన్ని ఉండాలి ఆయనకు సరిపడా స్టోరీ చేయలేకపోయాను ఇప్పటికీ ఆయనతో సినిమా చేయాలని అడుగుతుంటాను.

చిరంజీవి గారికి ఏదీ అంత ఈజీగా నచ్చదు. ఒక్కో సీన్ కోసం ఎంతో కష్టపడతారు. ఒక్కో డైలాగ్ కోసం ఎంతో టీమ్ వర్క్ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్.. మా దగ్గర అలా కాదు, ఒక ఐడియా రాగానే స్క్రిప్ట్ రెఢీ చేసి, సినిమా చేసేస్తాం.. ఇక్కడ చూస్తే రెండేళ్లు అయినా ఇంకా స్క్రిప్ట్‌ పని మీదే ఉన్నాను..ఆయనతో పనిచేసిన తర్వాత స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేయాలో నాకు అర్థం అయ్యింది. అందుకే నా స్క్రిప్ట్ పనుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, చాలా గ్యాప్ తీసుకుంటూ వచ్చాను.. ' అంటూ చెప్పుకొచ్చాడు నటుడు, దర్శకుడు ఉపేంద్ర. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 1000కోట్ల,2000 కోట్ల కలెక్షన్ తో ప్రపంచాన్ని షేక్ చేస్తుందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: