టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక చరణ్ నుంచి ఓ సోలో మూవీ వచ్చి దాదాపు మూడున్నర ఏళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న చరణ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కాజోల్ సౌత్ ధనుష్ 'VIP 2' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె హీరోయిన్ గా 1996 'మిన్సార కనువు' అనే మూవీలో ప్రభుదేవాకి జోడీగా నటించింది.

రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఇక తరువాత సౌత్ లో సినిమాలు చేయలేదు. మరల ధనుష్ 'VIP 2' లోనే కనిపించింది. తెలుగు సినిమాలలో మాత్రం ఇప్పటి వరకు ఆమె నటించలేదు. ఒక వేళ 'RC 16' లో కాజోల్ భాగం అయితే ఇదే ఆమె ఫస్ట్ తెలుగు సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఆమె ఫ్యాన్స్ కూడా తెలుగులో కాజోల్ ని ఒక్క సినిమాలో అయిన చూడాలని కోరుకుంటున్నారు. ఒక వేళ కాజోల్ ఈ చిత్రంలో నటిస్తే మాత్రం కచ్చితంగా హిందీ మార్కెట్ లో మంచి క్రేజ్ వస్తుంది.అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా ఆమె నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు.ఇక గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్‌కు మరో 24 రోజుల సమయం ఉంది. ఇక.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: