టాలీవుడ్‌లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. తండ్రి ఈవీవీ సత్య నారాయణతో కలిసి ఎన్నో కామెడీ ప్రధాన సినిమాలు చేసిన నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ అల్లరోడు ఇప్పుడు సీరియస్ కంటెంట్స్ మీద దృష్టి పెట్టాడు. కామెడీ సినిమాలే కాదు సీరియస్ సినిమాలతోనూ మెప్పించగడాలని నిరూపించుకున్నారు అల్లరి నరేష్. అయితే కేరీర్ లి దూసుకుపోతున్న సమయంలోనే సీరియస్ సినిమాలు కూడా చేశారు నరేష్. అయితే తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఒకటి దారుణంగా నిరాశపరిచింది తెలిపారు నరేష్. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అం ఉకున్నారట కానీ సీన్ రివర్స్ అయ్యిందని తెలిపారు నరేష్. ప్రస్తుతంహీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.ఇదిలావుండగా ఈ సినిమా టీజర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. నేచురల్ స్టార్ నానిసినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.ఈ సందర్బంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ బచ్చల మల్లెలో తనది సీరియస్ క్యారెక్టర్ అని తెలిపారు సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయన్నారు వచ్చే ఏడాది తన నుంచి రెండు కామెడీ చిత్రాలు వస్తాయని తెలిపారు తన పాత్ర బాగుంటే మల్టీ స్టార్ చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ వంటి స్టార్లతో మూవీ చేయాలని ఉంది అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గమ్యం, మహర్షి వంటి చిత్రాల్లో నరేష్ కీలక పాత్రను చేసిన విషయం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: