తనపై లైంగికంగా దాడి చేశాడని ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కస్టడీ గడువు ముగియడంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగింది. ఈ విషయం పైన జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ నా భర్తను కావాలనే ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేశారని జానీ మాస్టర్ భార్య సుమలత ఆరోపణలు చేశారు.
లేడీ కొరియోగ్రాఫర్, ఆమె తల్లి నా భర్తను వేధింపులకు గురి చేశారని కావాలనే జానీ మాస్టర్ జీవితాన్ని నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదులు చేశారు. కాగా, జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు కూడా రద్దు చేశారు.
అంతే కాకుండా పుష్ప-2 సినిమా నుంచి కూడా జానీ మాస్టర్ ను తీసివేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఇంట్లోనే ఉంటున్నారట. ఒక అమ్మాయి కారణంగా జానీ మాస్టర్ కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఓ మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ పేరు మొత్తం ఒక్కసారిగా పోయింది. సినిమా అవకాశాలు లేక బయటికి ఎక్కడికి వెళ్లలేక జానీ మాస్టర్ ఆందోళన చెందుతున్నాడట.