అక్కినేని అఖిల్ కు ఏజెంట్ సినిమా ఇచ్చిన షాక్ తో అఖిల్ తో పాటు ఆయన అభిమానులు కూడా బాగా హట్‌ అయ్యారు.. తర్వాత సినిమాలపై ఆచితూచి కథలను ఎంపిక చేసుకోవాలని ఉద్దేశం తో తర్వాతి సినిమా కోసం చాలా బ్రేక్ తీసుకున్నారు .. ఇక చివరిగా ఓ సినిమాను ఓకే చేశారు .. కిరణ్ అబ్బవరం తో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ చేసిన మురళి కిషోర్ అబ్బురు ఒక కథ చెప్పడం తో అది నచ్చడం తో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమాను తండ్రి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై , సితార ఎంటర్టైన్మెంట్స్ , పోర్చున్ ఫోర్ సినిమాస్ పతాకంపై ఈ సినిమాని నిర్మించబోతున్నారు ..


అలాగే ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించబోతున్నారు .. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను  మొదలు పెట్టబోతున్నారు . గతంలో మిస్టర్ మజ్ను సినిమాలో రొమాంటిక్ లవర్ బాయ్గా కనిపించాడు అఖిల్. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో పద్ధతి అయిన కురాడిలా కనిపించి మెప్పించాడు .. తర్వాత స్పై  థ్రిల్లర్ ఏజెంట్ సినిమా చేసి ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశాడు ఈ అక్కినేని హీరో .. తర్వాత తన నెక్స్ట్ సినిమాగా ప్రేమ కథను ఎంచుకున్నారు అఖిల్ .. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట..


ఇక  గతంలో యువి క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు అఖిల్ ఓకే చెప్పారట .. పాన్ ఇండియా మూవీగా చేయాలనుకున్న ఆ సినిమా 80 ల పీరియాటిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అన్నారు .. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారి ప్ర‌క‌ట‌న కూడా రాబోతుంది . అయితే ఇప్పుడు అఖిల్ మురళి కిషోర్ తో చేసే సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేశారు .. రీసెంట్ గానే పుష్ప 2లో కిసిక్ సాంగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టిన ఈ బ్యూటీ .. ఇప్పుడు అఖిల్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: