ఇలా పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్న సమయంలోనే .. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్ లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది .. ఈ సినిమా రిలీజ్ అయి 11 రోజులు దాటుతున్న బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి .. ఇక సినిమా రిలీజ్ అయి నిన్నటితో 11 రోజుల్లో పూర్తి చేసుకుంది .. నిన్న కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 104 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది .
దీంతో ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ అయిన 11వ రోజు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 మూవీ రికార్డులు క్రియేట్ చేసినట్టు సిని వర్గాలు చెబుతున్నాయి .. ఇక ప్రస్తుతం పుష్ప 2 అత్యధిక వసూలు రాబట్టిన మూడో సినిమాగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది .. దంగల్ సినిమా మొదటి స్థానంలో ఉండగా బాహుబలి 2 రెండో ప్లేస్ లో ఉంది .. ఇప్పుడు త్రిబుల్ ఆర్ , కే జి ఎఫ్ రికార్డ్ ను కూడా బన్నీ తిరగరాసి మూడో ప్లేస్ లో నిలిచాడు .. ఇదే రకంగా మరో వారం రోజులు కలెక్షన్లు వస్తే బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్ అవ్వటం ఖాయం .