త్రిష ఈ మధ్యకాలంలో ఏ పని చేసినా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.దానికి కారణం ఆమె వైఖరి కాస్త వేరుగా ఉండడమే. ఎందుకంటే లియో సినిమాలో నటించినప్పటినుండి విజయ్ తో మళ్ళీ ప్యాచప్ అయింది అన్నట్లు ఆమె విజయ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది.ఒకప్పుడు విజయ్ త్రిష మధ్య ప్రేమ ఉండేదని, కానీ ఆ తర్వాత వీరి మధ్య బంధం తెగిపోయిందని వార్తలు వినిపించాయి.కానీ ఎప్పుడైతే లియో సినిమాలో త్రిష చేసిందో అప్పటినుండి మళ్ళీ వీరి మధ్య ప్రేమ చిగురించిందట.ఇక త్రిష తన ఇన్నేళ్ల వయసులో ఎప్పుడూ కూడా ఎవరికోసం ఐటమ్ సాంగ్ చేయలేదు. కానీ మొదటిసారి విజయ్ చేసిన ది గోట్ మూవీ కోసం ఐటెం సాంగ్ చేసింది.అయితే అలాంటి బ్యూటీ విజయ్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తోంది.

విజయ్ తో సీక్రెట్గా వెకేషన్స్ కి వెళ్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టుల ద్వారా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతుంది.అయితే కోలీవుడ్ మీడియ మొత్తం ప్రస్తుతం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా కీర్తి సురేష్ పెళ్లికి విజయ్, త్రిష ఇద్దరూ సీక్రెట్ గా ఒకే ఫ్లైట్లో వెళ్లారు.అయితే వీరిద్దరూ ఒకే ఫ్లైట్లో వెళ్లిన వీడియో కూడా నెట్టింట బయటపడింది. దాంతో జస్టిస్ ఫర్ సంగీత అంటూ సోషల్ మీడియాలో ఒక యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. త్రిష విజయ్ ని ఎగరేసుకుపోతుందని సంగీతకి న్యాయం జరగాలంటూ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కోయంబత్తూర్ లోని ఓ ఆలయంలో త్రిష పూజలు చేసింది.

 అయితే ఈ ఆలయానికి త్రిష వచ్చిందనే సంగతి తెలియడంతో చాలామంది అభిమానులు గుడి దగ్గరికి ఎగబడ్డారు. ఆమెతో ఫోటోలు దిగడం కోసం తెగ ఆసక్తి చూపించారు.అయితే కొంతమందికి సెల్ఫీ ఇచ్చిన త్రిష ఆ తర్వాత వారితో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళింది. అయితే త్రిష కోయంబత్తూర్ లోని టెంపుల్లో పూజలు చేయడం వెనుక అనేక అనుమానాలు తెరమీదకి తీసుకువస్తున్నారు. విజయ్ తో పెళ్లికి రెడీ అయిందా.. అందుకే గగుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతుందా.. లేక మరేదైనా కారణం ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: