ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు బాయ్ ఫ్రెండ్స్ ని ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి అనుకున్నప్పటికీ మీడియాకు దొరకకుండా ఉండలేకపోతున్నారు.ఏదో ఒకచోట దొరికిపోతూ మీడియాకి అడ్డంగా బుక్ అవుతున్నారు. అయితే చాలామంది హీరోయిన్లు మేము సింగిల్..మాకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు అంటూ బిల్డప్పులు ఇచ్చినప్పటికీ ఏదో ఒక విషయంలో పప్పులో కాలుస్తూ మీడియాకి దొరికిపోతున్నారు. అయితే తాజాగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో మీడియాకి అడ్డంగా దొరికిపోయింది. మరి ఇంతకీ త్రిప్తి డిమ్రీ ఎవరితో డేటింగ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది సెలెబ్రేటీలకు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. వీకెండ్ కోసం చాలా ప్లాన్లు చేసుకొని ఉంటారు. 

అయితే తాజాగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కూడా వీకెండ్ కోసం తన బాయ్ఫ్రెండ్ తో ఏదైనా వెకేషన్ ని ప్లాన్ చేసుకుందో లేక డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకుందో తెలియదు కానీ మీడియాకి అడ్డంగా దొరికిపోయింది. ఇక విషయంలోకి వెళ్తే..త్రిప్తి డిమ్రీ గత కొద్ది సంవత్సరాలుగా బిజినెస్ మాన్ సామ్ మర్చంట్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టకపోయినప్పటికీ ప్రతిసారి ఆయనతో ఏదో ఒక దగ్గర  మీడియాకి దొరికిపోతూ ఉంటుంది. అయితే గతంలో నటి అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో ప్రేమలో ఉన్న త్రిప్తికి 2022లో ఆయనతో బ్రేకప్ జరిగింది. కర్నేష్ తో బ్రేకప్ అయినప్పటినుండి త్రిప్తి సామ్ మర్చంట్ తో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
అయితే తాజాగా ఆదివారం రోజు ఓ రెస్టారెంట్లో సామ్ మర్చంట్ తో కలిసి త్రిప్తి డిమ్రీ కనిపించింది. అయితే మొదట్లో మీడియా కి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇద్దరినీ కలిసి ఫోటో తీద్దాం అని మీడియా వాళ్ళు అనుకుంటే నో నో వద్దు ఇక్కడితో చాలు అన్నట్లు సైగలు చేసింది. అయితే ప్రస్తుతం త్రిప్తి డిమ్రీ సామ్ మర్చంట్ కలిసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాతోఓవర్ నైట్ లో స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ హీరోయిన్ కి నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఇక రీసెంట్ గా ఈమె చేసిన బ్యాడ్ న్యూజ్,భూల్ భూలయ్య -3 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో త్రిప్తి కి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: