ఇక టైటిల్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ తో స్నేహం చేసిన కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యాక బయటకి వచ్చి నిఖిల్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. అయితే గౌతమ్ అలా చేయలేదు. సోలో బ్రాండ్ తోనే ఇంత దూరం రావడం అయితే చాలా కష్టం. ఈ క్రమంలో నిఖిల్ టైటిల్ గెలుస్తాడు అనుకున్న ఆయన ఫ్యాన్స్ కి చాలా టెన్షన్ పట్టించాడు గౌతమ్. ఇక అసలు విషయంలోకి వెళితే... టైటిల్ గెలుచుకున్న నిఖిల్ కి 42 లక్షల రెమ్యూనరేషన్ తో పాటు, 55 లక్షల ప్రైజ్ మనీ దక్కిన విషయం విదితమే. రెమ్యూనరేషన్లో ఎలాంటి కట్టింగ్స్ లేవు కానీ, ప్రైజ్ మనీ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ టాక్స్ తో పాటు, 30 శాతం జీఎస్టీ పడుతుంది. దాంతో 55 లక్షల ప్రైజ్ మనీ కాస్త 39 లక్షలు అయ్యింది. అలా నిఖిల్ ఆఖరికి 79 లక్షల రూపాయిలు + కారు ఈ సీజన్ ద్వారా సంపాదించాడు.
ఈ నేపథ్యంలోనే రన్నర్ గౌతమ్ కి ప్రైజ్ మనీ ఎంత వచ్చి ఉంటుంది అనే విషయం గురించి ఇపుడు తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే, గౌతమ్ కి 24 లక్షల రూపాయిల ప్రైజ్ మనీతో పాటుగా పది వారాలు ఆయన కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు 30 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నాడని వినికిడి. అలా మొత్తం మీద ఆయనకు 54 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ అందినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ఈ విషయాలన్నీ నిన్నటి ఎపిసోడ్ లోనే చూపించి ఉండొచ్చు. కానీ అప్పటికే చాలా సమయం అయిపోవడంతో 9 గంటలు లోపు షో ముగించాలని పోలీసులు చెప్పడంతో, హడావడిగా షూటింగ్ ని పూర్తి చేసారని అంటున్నారు.