ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా అద్భుతంగా నటించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాస్తోంది. కాగా, ఈ సినిమా విడుదలైన 11 రోజులలోనే 1409 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దింతో 2024 లో హిట్ కొట్టిన మూవీ లిస్ట్ లో చేరిపోయింది పుష్ప 2. అలాగే పుష్ప 2 వివాదంలో కూడా చిక్కుకుంది. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షోలు నిర్వహించారు.
దీనికి అల్లు అర్జున్ హాజరయ్యారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అంతేకాకుండా రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవతి మరణించిన విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ రూ.25 లక్షల రూపాయలను ప్రకటించారు. శ్రీతేజ్ చికిత్సకు అవసరమైన వైద్యం చేపిస్తున్నాడు.
అంతేకాకుండా రేవతి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పాడు. అంతేకాకుండా రేవతి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పడంతో రేవతి కుటుంబ సభ్యులు సంతోషంలో ఉన్నారు. ఈ విషయం మీద అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యారు. ఒక రోజంతా జైలు జీవితం గడిపి అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఎప్పటికప్పుడు రేవతి కుమారుడు శ్రీతేజ్ కు సంబంధించిన ఆరోగ్య విషయాలను తెలుసుకుంటూనే ఉంటున్నాడు.