ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రోజా.. భైరవద్వీపం సినిమాతో తన కెరియరే మారిపోయింది.తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన రోజా.. కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది. రోజా కి కూడా రాజకీయాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండడంతో మొదట టిడిపి పార్టీలోకి చేరింది. అక్కడ మహిళా అధ్యక్షురాలిగా ఎదిగిన ఈమె 2009లో టిడిపి పార్టీ నుంచి చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్ని రోజులకు టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పేసింది.
అలా 2014లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు ఇక 2019లో కూడా గెలవడంతో ఈమెకు ఏపీఐఐసీ చైర్మన్ మంత్రిగా కూడా సేవలందించింది. 2024 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే తాజాగా రోజా కూతురు అన్షు మాలికకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రోజా తన కూతురు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.. మి కూతురు బడా ఫ్యామిలీ గా పేరు పొందిన ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోందా అని యాంకర్ అడగగా..? మొదట ఈ విషయం విన్నర్ రోజే షాక్ అయినా ఇదంతా కూడా కేవలం రూమర్స్ అని ప్రస్తుతం తన కూతురు చదువుకోసమే యూఎస్ఏ కి వెళ్లిందని తెలిపింది.. తన కూతురు యాక్టర్ కావాలనుకుంటే యాక్టర్ అవ్వచ్చు.. లేకపోతే తనకు ఇష్టమైన ప్రొఫెషనల్ వైపు వెళ్లవచ్చు అంటూ తెలిపింది రోజా. మొత్తానికి తన కూతురు పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చేసింది రోజా.. అయితే రోజా కూతురు అన్షు మాత్రం అందం అభినయంతో వెలిగిపోతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు కూడా వైరల్ గా మారుతుంటాయి.