ఇటీవల బిగ్ బాస్-8 వ సీజన్ కూడా ముగియడం జరిగింది. విన్నర్ గా కూడా నిఖిల్ గెలవడం జరిగింది.. అయితే బిగ్ బాస్ షో మొదటీ  సీజన్ నుంచి రెగ్యులర్ టాక్ దానిమీద చర్చ వంటివి జరుగుతూ ఉంటాయి.. మొదటి సీజన్ మీద అంతగా లేకపోయినా రెండవ సీజన్ మీద కొంచెం తగ్గింది.. అయితే ఇప్పుడు అసలు చూసింది ఎంతమందో తెలియడం లేదట. గతంలో కూడా ఎన్నోసార్లు బిగ్ బాస్ షో మీద చాలామంది హైకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. పలు రకాల హెచ్చరికలను కూడా చేశారు.ఇందులో కొన్ని బూతు సన్నివేశాలు వల్గర్ వర్డ్స్ కూడా ఉంటాయని చాలామంది వీటిని చూడడం తగ్గించారు.


ఇటీవలే బిగ్ బాస్ 8 విజేతగా నాగార్జున సీరియల్ నటుడు నిఖిల్ ను విజేతగా ప్రకటించడం జరిగింది. ఆదివారం రోజున గ్రాండ్ ఫినాలే కూడా జరిగింది. ఇందుకు రామ్ చరణ్ కూడా ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. ఓటింగ్లో అగ్రస్థానంలో నిఖిల్ ఉన్నాడని నాగార్జున విజేతగా ప్రకటించారు. నిఖిల్ కు సినీ నటుడు రామ్ చరణ్ ట్రోఫీని అందించడంతో పాటుగా 55 లక్షల రూపాయలు చెక్కుని కారుని కూడా అందించడం జరిగింది.



టాప్-5 లో ఉన్న అవినాష్ ,ప్రేరణ, నబిల్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ కృష్ణ రెండవ స్థానంలో నిలిచారు.. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే .. బిగ్ బాస్ మొదలవుతోందంటే చాలు కచ్చితంగా వీటి మీద నానా హంగామా రచ్చ చేస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత మొదలైన బిగ్ బాస్ షో మీద కూడా ఎన్నో చర్చలు జరిగినప్పటికీ చివరికి మాత్రం ఓటింగ్ తోనే భారీగా కంటెస్టెంట్లను గెలిపిస్తూ ఉన్నారు.. మరి దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ షో చూడము బ్యాన్ చేయమని చెబుతారు కానీ మరి ఓటింగ్ ఎలా చేస్తున్నారన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే కొంతమంది మాత్రం కంటిస్టేంట్ల ఎంపిక అప్పుడే ఎవరిని విన్ చేయాలని విషయంపై కూడా క్లారిటీ ఉంటుందని అలాగే పాటిస్తూ ఉంటారని తెలుపుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: