ఇటీవల సంధ్యా థియేటర్ ఎదుట జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యుడు అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యం అంటూ మృతురాలి భర్త కేస్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత బన్నీని అరెస్ట్ చేయడం, ఆపై మధ్యంతర బెయిల్ రావడం జరిగిపోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాధిత కుటుంబాలకి నష్టపరిహారం కింద కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతమంది అతనికి మద్దతుగా నిలిచారు. మరి కొంతమంది మాత్రం విపరీతమైన విమర్శలు చేశారు. బన్నీ కేవలం ఒక్క రాత్రి జైలులో ఉండి రావడంతో అతన్ని పరామర్శించడానికి ఎంతోమందికి భారీ ఎత్తున తరలివచ్చారు. కానీ తల్లిని కోల్పోయిన పిల్లల్ని కనీసం పలకరించారా? అని ప్రశ్నించారు.

ఆమె కొడుకు శ్రీ తేజ్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కదా, కనీసం మెరుగైన చికిత్స అందించాలని ఎవరైనా సినీ పెద్దలు వెళ్లి డాక్టర్లకు చెప్పారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆ పిల్లోడిని ఒక్కసారైనా చూడాలని మీ మనసు కరగలేదా బన్నీ అంటూ నిలదీస్తున్నారు. అయితే ఈ విషయం దృష్టికి వచ్చిన బన్నీ తనకు వెళ్లాలనే ఉందని కానీ లీగల్ ప్రొసీజర్ నడుస్తున్న వేళ బాధితులను తాను కలవడం కుదరడం లేదని స్పష్టం చేశారు. వారి కుటుంబానికి తాను తప్పనిసరిగా అండగా ఉంటానని, ముందుగా చెప్పిన మాటకు కచ్చితంగా కట్టుబడి ఉంటానని కూడా భరోసా ఇచ్చారు.

అయితే లీగల్‌గా తాను కలవడం కుదరదు అని బన్నీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. చాలామంది విశ్లేషకులు బాధితులను కలవకుండా ఏ చట్టం ఆపదు కదా, అల్లు అర్జున్‌కు కలవకూడదనే మాట అసలు ఎవరు చెప్పారు అని క్వశ్చన్ చేస్తున్నారు. సాధారణంగా న్యాయస్థానాలు ఒక కేసు నడుస్తున్నప్పుడు ఆధారాలను మాయం చేయకుండా, ఇంకా బాధితులను బెదిరించకుండా, ప్రభావితం చేయకుండా నిందితులను కట్టడి చేస్తాయి.

కానీ శ్రీ తేజ్‌ను సందర్శించడంలో కేసు ప్రభావం అయ్యే అవకాశం ఉండదు. అతను ఒక చిన్న పిల్లాడు, పైగా బన్నీకి వీరాభిమాని. ఆ సమయంలో అల్లు అర్జున్ అతని వద్దకు వచ్చి మాట్లాడితే అతనికి కాస్త ఊరట లభిస్తుంది. మానసికంగా ధైర్యం కలిగి చికిత్సకు మంచిగా స్పందించే అవకాశం ఉంది. బన్నీ ఇలా చేస్తే ఏ కోర్టు, ఏ చట్టం కూడా అభ్యంతరం తెలపదు. ఈ విషయం అల్లు అర్జున్ కు తెలియకపోవచ్చు. పక్కన ఉన్నవారు అతన్ని మిస్ గైడ్ చేస్తూ ఉండొచ్చు. అందుకే ఇప్పటివరకు బన్నీ ఆ పిల్లవాడిని చూడలేదు. ఏది ఏమైనా ఇప్పుడు అల్లు అర్జున్ ని బాధితులని కలవకుండా ఎవరు ఆపు చేస్తున్నారు, అతనికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఇలా చేస్తున్నారా అనేది ఆసక్తికర అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: