టాలీవుడ్ యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ కి వరుస పెట్టి అపజయాలు వస్తున్నాయి. ఆఖరుగా నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా భారీ అపజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న  రాబిన్ హుడ్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీలలో రాబిన్ హుడ్ మూవీ ముందుగా థియేటర్లలోకి రాబోతుంది. ఇకపోతే రాబిన్ హుడ్ మూవీ ని కొంత కాలం క్రితం ఈ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 25 వ తేదీ నుండి తప్పించినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల నుండి ఈ సినిమాను డిసెంబర్ 25 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలి అని ప్లాన్ ను కూడా విరమించుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ ని సంక్రాంతి భరి నుండి తప్పించి వేరే నెలలో విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నితిన్ మాత్రం ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. మరి మైత్రి సంస్థ వారు ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: