మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తూ నిర్మించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 9 వ తేదీనే ప్రదర్శించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే కానీ జరిగితే ఈ సినిమా జనవరి 9 వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా జనవరి 9 వ తేదీ నుండి ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ జనవరి 9 వ తేదీ నుండి నెట్ ఫ్లెక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే కానీ జరిగితే పుష్ప పార్ట్ 2 మూవీ ఓ టీ టీ లోకి వచ్చిన రోజే గేమ్ చేంజర్ మూవీ థియేటర్లలోకి వస్తుంది. అలా రావడం వల్ల ఓ టీ టీ కంటెంట్ ను ఇష్టపడే జనాలు గేమ్ చేంజర్ సినిమాపై ఆసక్తిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: