టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ దగ్గర ఎలా దుమ్ము దులుపుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పుష్ప గాడి దెబ్బకు ఎన్నో రికార్డులు కనుమరుగు అయిపోయాయి. పుష్ప గాడు సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అయినా కూడా పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపే కలెక్షన్లతో దూసుకు వెళ్తోంది. 11 రోజులకు పుష్ప ప్రపంచ వ్యాప్తంగా రు. 1400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. మరే ఇండియన్ సినిమాకు దక్కని అరుదైన రికార్డులు ఎన్నో పుష్ప ఖాతాలో పడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప ఓటిటి రిలీజ్ డేట్ పై వార్త చక్కెరలు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల డీల్ ప్రకారం చూసుకుంటే జనవరి 8వ తేదీ లేదా తొమ్మిదో తేదీన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ లోకి అమ్మినప్పుడు సినిమా రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాత ఎప్పుడైనా ఓటీటీ లో రిలీజ్ చేసుకుంటామని నెట్ ప్లిక్స్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఈ డీల్ ప్రకారం జనవరి 8 లేదా 9న పుష్ప ఓటిటి ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తుంది. సంక్రాంతి సమయం కావడంతో మంచి స్పందన కూడా వస్తుందని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ప్రత్యేక గీతం లో నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా .. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ ముందే ప్రపంచ వ్యాప్తంగా రు. 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే.