ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. గత రెండు మూడు రోజులుగా మంచు మనోజ్ తో పాటు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి ఇద్దరు కూడా జనసేన లో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక్కటే వార్తలు వైరల్ అయ్యాయి. సోమవారం తన అత్తగారు ఊరైన ఆళ్లగడ్డ వచ్చిన మనోజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి దీనిపై తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. ఈ రోజు మా అత్తయ్య గారి జయంతి అందుకోసమే మొదటిసారి మా కుమార్తె దేవసేన శోభ ను ఆళ్లగడ్డ తీసుకువచ్చాం . .. జయంతి రోజు తీసుకు వద్దామని ఎన్నాళ్లు ఇక్కడకు తీసుకురాలేదు మా కుటుంబం సోదరులు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాం .. ఊర్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారు అందరికీ ధన్యవాదాలు .. రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అని మంచి మనోజ్ తెలిపారు.
ఇక ఇటీవల కాలం లో మంచు ఫ్యామిలీ లో ఆస్తుల గొడవో లేదా మరో గొడవో స్పష్టంగా తెలియదు కాని .. అన్న దమ్ములు అయిన మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ మధ్య పెద్ద గొడవలు జరగడం .. చివరకు ఇద్దరూ పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కి కేసులు పెట్టుకోవడం.. ఈ గొడవలో తండ్రి మంచు మోహన్ బాబు సైతం పెద్ద కుమారుడు విష్ణు వైపే ఉన్నట్టు కనపడింది. గొడవ సర్దు మణిగింది అని అందరూ అనుకుంటో న్న టైం లో మళ్లీ మనోజ్ తన ఇంట్లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చు కుంటుంటే మనోజ్ బౌన్సర్లు లోపల కు వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారని మనోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.