ఐదు బడా ఇండస్ట్రీలు ఉన్న మనదేశంలో కేవలం ఒక ప్రాంతానికి చెందిన సినిమా 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం సాధారణమైన విషయం కాదు. భిన్నమైన భాషలు.. భిన్నమైన సంస్కృతులు వీటిలో ఏకత్వం సాధించాలంటే గొప్ప వీరుడే దిగి రావాలి.. అయితే సినిమా ఇండస్ట్రీలో హద్దులు చెరిపేశారు. బాహుబలి సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు వెయ్యి కోట్లను ఎనిమిది సినిమాలు మాత్రమే సాధించాయి. ఎందుకు ఆ సినిమాలు ఏమిటి ? ఆ డైరెక్టర్లు ఎవరో చూద్దాం.
1) బాహుబలి 2 ( 2017 ) :
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ మోషన్ పిక్చర్ బాహుబలి 2. రు. 1000 కోట్లు కొల్లగొట్టిన తొలి భారతీయ సినిమాగా రికార్డుల్లో నిలిచింది.
2) దంగల్ (2016) :
బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించిన దంగల్ బాహుబలి 2 కన్నా ముందే రిలీజ్ అయిన టెక్నికల్ గా బాహుబలి 2 తర్వాతే 1,000 కోట్లకు క్లబ్లోకి అడుగుపెట్టింది
3) కే జి ఎఫ్ 2 ( 2022 ) :
కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటగా తీసిన కే జి ఎఫ్ మూవీ కొనసాగింపుగా కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చి 1000 కోట్లు వసూలు చేయడం విశేషం.
4) పఠాన్ ( 2023 ) :
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసిన రెండో బాలీవుడ్ సినిమాగా నిలిచింది.
5 ) జవాన్ ( 2023 ) :
సౌత్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ షారుక్ ఖాన్‌ను ఒకే ఏడాదిలో రెండోసారి రు. 1000 కోట్ల క్లబ్లోకి తీసుకువెళ్లాడు.
6 ) త్రిబుల్ ఆర్ ( 2023 ) :
రు. 1000 కోట్ల క్లబ్ లోకి రెండోసారి అడిగి పెట్టిన భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.
7 ) కల్కి ( 2024 ) :
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అస్విన్ మరోసారి తెలుగోడి తడాఖా చూపెట్టాడు. ప్రభాస్‌తో తెరకెక్కించిన కల్కి సినిమా 1000 కోట్లు క్రాస్ అయ్యింది.
8 ) పుష్ప 2 ( 2024 ) :
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న పుష్పరాజు గాడి పుష్ప 2 తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ ఇచ్చింది.