యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సముద్ర తీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమా చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
 
దేవర సినిమాలో మాస్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్ లో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేవర సక్సెస్ సాధించిన నేపథ్యంలో దేవర సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర1 సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేదని కచ్చితంగా చెప్పవచ్చు.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తారక్ వార్2 సినిమాకు పరిమితం అయిన సంగతి తెలిసిందే. దేవర సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ ఆకట్టుకోలేదు. దేవర పాత్రను తీర్చిదిద్దిన స్థాయిలో వర పాత్ర లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. వర పాత్ర కూడా అద్భుతంగా ఉంటే సినిమా రేంజ్ మారిపోయేది.
 
దేవర సినిమాకు యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దేవర నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ అయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: