అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ ని విడుదల చేశారు. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నప్పటికీ కొన్ని ఏరియాలలో మాత్రం ఈ మూవీ పెద్ద నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు రెండు ఏరియాల ద్వారా నష్టాలు వచ్చే అవకాశాలు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు తెలుగు తర్వాత మంచి క్రేజ్ ఉన్న ప్రాంతం కేరళఎం కేరళ రాష్ట్రంలో బన్నీ నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దానితో పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన కేరళ థియేటర్ హక్కులను భారీ ధరకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. కానీ ఈ ప్రాంతంలో ఈ సినిమా ఇప్పటివరకు 7 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ కి దాదాపు ఈ ప్రాంతంలో 13 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాకు 24 మిలియన్ డాలర్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఈ సినిమాకు కేవలం 13 మిలియన్ డాలర్ల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ ప్రాంతంలో కూడా ఈ సినిమా ద్వారా నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా పుష్ప 2 మూవీ కి కేరళ , నార్త్ అమెరికా ఏరియాలలో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa