- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈనెల ఐదున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే నాలుగో తేదీ సెకండ్ షో నుంచి పుష్ప 2 ప్రీమియర్లు మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో నే హైదరాబాదు లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్ స్వయంగా హాజరయ్యారు. సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ర్యాలీగా రావడంతో పాటు కారులో నుంచొని ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ధియేటర్ దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిస లాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. రేవతి కుమారుడు హైదరాబాదులోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నమోదైన కేసులో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం ... ఒక రాత్రి జైలులో పెట్టడం ఆ మరుసటి రోజు ఉదయం రిలీజ్ చేయటం జరిగిన సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రిమాండ్ కు అసలు కారణం బయటకు వచ్చింది. సంధ్య థియేటర్ ప్రీమియర్ షో కి సెలబ్రిటీలను రానివద్దని థియేటర్ యాజమాన్యాన్ని తాము ముందే హెచ్చరించినట్టు పోలీసుల లేఖ‌ వైరల్ అవుతుంది. దీని ప్రకారం యాజమాన్యం - అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని పోలీసుల తరపు లాయర్ వాదించినట్టు తెలుస్తోంది. దీంతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు మాత్రం ఈ కారణాన్ని తోసిపొచ్చుతూ అల్లు అర్జున్ కు మధ్యంతర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మ‌రి ఈ లెక్క‌న చూస్తే బ‌న్నీ తో పాటు థియేట‌ర్ యాజ‌మాన్యాని కి సెల‌బ్రిటీలు రావొద్ద‌ని ముందే సంకేతాలు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: