రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ''గేమ్ ఛేంజర్''. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్వీసీ బ్యానర్ లో 50వ చిత్రం కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. ఒక స్టార్ హీరో మూవీకి రావాల్సినంత హైప్ అయితే రాలేదనే చెప్పాలి. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. కానీ దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో సందడి కనిపించడం లేదు.'గేమ్ ఛేంజర్' సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు.ఇదిలావుండగా రామ్ చరణ్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింటా హల్చల్ చేస్తుంది అదేమిటంటే రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన రంగ‌స్థ‌లం సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తేలిసిందే. న‌టుడిగా రామ్‌చ‌ర‌ణ్‌ను కొత్త కోణంలో ఈ సినిమాతో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.చిట్టిబాబు అనే చెవిటిత‌నంతో బాధ‌ప‌డే యువ‌కుడిగా అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు రామ్‌చ‌ర‌ణ్‌. 60 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 220 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది.

రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే రంగస్థలం కు ఇది పూర్తి భిన్నం గా ఉండనుందని సినీ వర్గాల్లో  టాక్ వినిపిస్తుంది. ఇందులో చరణ్ కొత్తగా స్టైలిష్ గా కనిపిస్తారని సమాచారం. రొమాన్స్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉన్న యాక్షన్ డ్రామా గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలావుండగా ప్రస్తుతానికైతే మిగతా సంక్రాంతి సినిమాల కంటే 'గేమ్ ఛేంజర్' కాస్త వెనుకబడి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్ కు ఇంకా నాలుగు వారాల సమయమే ఉంది కాబట్టి, ఈ గ్యాప్ లో హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే డల్లాస్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే 'ధోప్' అనే నాలుగో పాటను విడుదల చెయ్యాలని చూస్తున్నారు. నెలాఖరున థియేట్రికల్ ట్రైలర్ ను వదులుతారని సమాచారం. దీని కోసం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఫంక్షన్ చేస్తారని, దీనికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా వస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇవన్నీ జరిగే క్రమంలో రామ్ చరణ్ సినిమాకి హైప్ పెరుగుతుందేమో చూడాలి. అలాగే మరోవైపు సుకుమార్ పుష్ప టు సక్సెస్ తో హ్యాపీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: