హిందీ వెర్షన్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ సినిమాలు ఏవో తెలుసు కుందాం. అందులో పుష్ప పార్ట్ 2 సినిమా ఏ స్థానంలో ఎన్ని కోట్ల కలెక్షన్లతో నిలిచింది అనే వివరాలను కూడా తెలుసు కుందాం.

అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా కేవలం 11 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి హిందీ వర్షన్ లో 561.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి హిందీ వర్షన్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.  ఇకపోతే ఇప్పటికీ కూడా ఈ సినిమాకు హిందీ ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వస్తున్నాయి. దానితో ఈ మూవీ హిందీ వర్షన్ లో మరిన్ని కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 

ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 511 కోట్ల కలెక్షన్లను హిందీ వర్షన్ లో వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 435.2 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరో గా మగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 294.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 276.8 కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: