•రీయంట్రీలో తల్లి గెటప్ తో అదరగొట్టిన నివేదా థామస్

•చిన్న సినిమాగా వచ్చి అవార్డుల వర్షం

•కంటెంట్ పరంగా బ్లాక్ బాస్టర్..


ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఎన్నో చిత్రాలు టాలీవుడ్ నుంచి విడుదలయ్యాయి.. అయితే అందులో మాత్రం కొన్ని సినిమాలే బెస్ట్ గా అనిపించి,  అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదట 'నిన్ను కోరి' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నివేదా థామస్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకుంది. ఎలాంటి పాత్రలోనైనా సరే అవలీలగా నటించే నివేదా థామస్ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా.. మళ్లీ నివేదా థామస్ నటించిన '35 చిన్న కథ కాదు' అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

మొదట ఈ సినిమాలో ఈమె లుక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  ఈమె అధిక బరువు చూసి మరింత అభిమానులను ఆశ్చర్యానికే కలిగించింది. అంతేకాదు ఈమె లుక్కుకి విమర్శలు కూడా కురిపించారు. చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రముఖ డైరెక్టర్ నందు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శి టీచర్ గా నటించి మరొకసారి అద్భుతమైన నటనను కనబరిచారు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న 35 చిన్న కథ కాదు సినిమా కి ఒక అరుదైన గౌరవం కూడా లభించింది


అదేమిటంటే ఈ సినిమా గోవాలో జరిగిన ప్రముఖ ఇండియన్ పనోరమ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సైతం ప్రదర్శించారట. సుమారుగా అక్కడికి 25 సినిమాలను ప్రదర్శించారట. అందులో భాగంగా 384 చిత్రాలలో నివేద థామస్ నటించిన 35 చిన్న కథ కాదు సినిమా కూడా ఎంపిక అయిందట.. నివేదా థామస్ తన అదృష్టాన్ని పరీక్షించుకొని మరొకసారి సక్సెస్ అయ్యిందని  అభిమానులు తెలియజేశారు. ముఖ్యంగా సాధారణ మహిళలు కూడా తమ కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు, పిల్లల చదువు విషయంపై ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: