కాజల్ అగర్వాల్ .. ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ వరుసగా అభిమానులకి గుడ్ న్యూస్ చెబుతూ వచ్చింది . మొదట పెళ్లి.. ఆ తరువాత ప్రెగ్నెన్సీ.. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్.. ఆ తరువాత కొత్త ఇల్లు.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ గుడ్ న్యూస్ లు చెప్పింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమెకి సంబందించిన వార్త  బాగా వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం కాజల్ మరొకసారి అభిమానులకి స్వీట్ న్యూస్ వినిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .


మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్  అగర్వాల్ చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకుని త్వరగా ఒక బిడ్డకు జన్మనిచ్చేసింది . సాధారణంగా స్టార్ హీరోయిన్స్ వెంటనే పిల్లలని కనడానికి ఇంట్రెస్ట్ చూపరు . కానీ ఈ అందాల ముద్దుగుమ్మ మాత్రం త్వరగా ప్లాన్ చేసుకుంది.  నీల్ కిచ్చులుకి జన్మించిన తర్వాత తన బాడీ ఫిజిక్ మొత్తం మారిపోయింది . అయినా సరే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి రావాలి అంటూ చాలా త్వరగానే తన బాడీని మళ్లీ కంట్రోల్లోకి తెచ్చుకుని కత్తిలాంటి ఫిజిక్ మైంటైన్ చేసింది కాజల్ అంటూ..



 ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలా మాట్లాడుకున్నారో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే విధంగా మాట్లాడుకునేలా చేసింది.  అంతేకాదు ఇప్పుడు కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీగా ముందుకెళ్తుంది . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది . కాజల్ అగర్వాల్ రెండోసారి తల్లి కాబోతుంది అంటూ బాగా ప్రచారం జరుగుతుంది . ఈ కారణంగానే ఆమె కొత్త సినిమాలకి కమిట్ అవ్వడం లేదట . ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసేసి మరి తన సెకండ్ ప్రెగ్నెన్సీ లైఫ్ ని ఎంజాయ్ చేయబోతుందట.  ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . దీంతో కొంతమంది అభిమానులు కాజల్ అగర్వాల్ కి కంగ్రాట్యులేషన్స్ అంటే విషెస్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: