కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. గడిచిన 11 నెలల 15 రోజుల్లో చూసుకుంటే, భారతీయ చిత్ర పరిశ్రమలో అనేక భాషల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. సక్సెస్ రేట్ విషయం పక్కన పెడితే, విజయం సాధించిన సినిమాలు అయితే భారీ వసూళ్లే రాబట్టాయి. అయితే వసూళ్ల పరంపర ఎలా వున్నా ఇక్కడ నేషనల్ అవార్డ్స్ కొట్టే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలా అవార్డులు పొందాలంటే నటీనటులు తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడే అవి అవార్డులను పొందే అర్హతను కలిగి ఉంటాయి. అయితే ఈ సంవత్సరం చాలా భాషల సినిమాలు చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు గడించాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా లేకపోలేదు!

అయితే అవార్డుల విషయంలో ఎన్ని కేటగిరీలు ఉన్నా, ఉత్తమ నటుడు కేటగిరీకి ఉన్న గిరాకీనే వేరు. ఇక ఈ సంవత్సరం మన తెలుగు హీరోని కలుపుకొని కొందరు ఇతర సినీ పరిశ్రమల హీరోలు 'ఉత్తమ నటుడు' కేటగిరీలో రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అల్లు అర్జున్ ఒకరు. అవును, గతేడాది అల్లు అర్జున్ పుష్ప సినిమా పార్ట్ 1లో మంచి నటనను కనబరిచినందుకు గాను ఉత్తమ నటుడు కేటగిరిలో అవార్డుని పొందడం జరిగింది. అయితే ఇపుడు 'పుష్ప 2'తో కూడా అల్లు అర్జున్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నారు. 11 రోజుల్లోనే 1400 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించి అరుదైన ఫీట్ సంపాదించాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ నటన గురించి క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ సంవత్సరం కూడా ఉత్తమ నటుడు కేటగిరిలో అల్లు అర్జున్ అవార్డుని పొందే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఈ లిస్టులో "పృథ్వీరాజ్ సుకుమారన్" ఒకరు. "ది గోట్ లైఫ్" సినిమాలో హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేసిన నటన న భూతొ న భవిష్యతి. 'ఆడు జీవితం' పేరుతో ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాగా విమర్శల ప్రశంసలు దక్కించుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారి ప్రాంతంలో తీసిన తొలి భారతీయ సినిమా కావడంతో ఈ ఏడాది అవార్డు పృథ్వీరాజ్ సుకుమారన్ దే అని కొందరు అంటున్నారు.

అదేవిధంగా మరో మలయాళ హీరో "మమ్ముట్టి" కూడా ఈ రేసులో ఉన్నారు. ఆయన నటించి మెప్పించిన చిత్రం "భ్రమయుగం." మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం ఇది. కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడిన ఈ పీరియడ్ హారర్ థ్రిల్లర్లో మమ్ముట్టి ఇరగదీసారు. ఓ ఓ మాటలో చెప్పాలంటే నట విశ్వరూపం చూపించారు. ఇప్పటికే మూడుసార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న మమ్ముట్టి.. ఈసారి బెస్ట్ యాక్టర్ గా మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంటారని మరికొంతమంది అనుకుంటున్నారు.

ఈ లిస్టులో నాల్గవ వ్యక్తి తమిళ నటుడు "విక్రమ్." తంగలాన్ అనే సినిమాలో విక్రమ్ తన విశ్వరూపాన్ని చూపించారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో 19వ శతాబ్దంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కగా దీని కోసం విక్రమ్ మామూలుగా కష్టపడలేదు. తంగలాన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారనే చెప్పుకోవచ్చు. గతంలో 'శివ పుత్రుడు' సినిమాకి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ అందుకున్న చియాన్.. ఈ ఏడాది మళ్ళీ ఉత్తమ నటుడిగా నిలుస్తారని ఆయన అభిమానులు అంటున్నారు.

ఈ లిస్టులో ఆఖరి వ్యక్తి "విజయ్ సేతుపతి." విజయ్ సేతుపతి నటించిన మహారాజా ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో ఒక సాధారణ బార్బర్ పాత్ర‌లో సేతుప‌తి స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆద్యంతం క‌ట్టిప‌డేశాడు. దాంతో గతంలో 'సూపర్ డీలక్స్' సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న సేతుపతి.. ఈసారి కూడా అవార్డుని కొట్టే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: