కమర్షియల్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న అందాల ముద్దుగాములు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద తమ ఫోకస్ పెట్టారు .. ఇప్పటికే భారీ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు కాబట్టి ఇక న‌టిగా పేరు తెచ్చుకోవాలని వారు ఫిక్స్ అవుతున్నారు .. అందుకే లేడీ ఓరియంటెడ్ కథలను వెంటనే ఓకే చేసేస్తున్నారు . ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న .. బాలీవుడ్ మూవీస్ తో పాటు సౌత్ సినిమాల తో ఫుల్ బిజీగా కొనసాగుతుంది .. అలాగే గ్యాప్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ..


పుష్ప 2 లాంటి బ్లాక్బస్టర్ తర్వాత .. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది రష్మిక. డిఫరెంట్ సినిమాలు తో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్‌ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సై అంటున్నారు .. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ చేస్తున్నారు .. కథ నచ్చితే ఆ సినిమాకు స్వయంగా ఆమె నిర్మాతగా కూడా ఉంటుంది సంయుక్త .. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్టులో చేరిపోయింది ..


తాతినేని సత్యా దర్శకత్వం లో వస్తున్న సతీ లీలావతి సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు లావణ్య.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పేజీలో ఉన్న ఈ సినిమా టైటిల్ పాస్టర్ రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్ .వరుస అపజయాలతో ఇబ్బందుల్లో ఉన్న పూజ హెగ్డే కూడా వచ్చే 2025 లో సోలో హిట్ మీద కన్నేశారు .. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంట్ సినిమా చేస్తున్నారు ఈ జిగేల్ రాణి .. ఇలా స్టార్ హీరోయిన్లందరూ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: