ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటించగా ... డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి అద్భుతమైన పాజిటివ్ టాక్ జనాల నుండి రావడంతో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 1300 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా 16 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1300 ప్లస్ కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ సినిమా రికార్డును తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ క్రాస్ చేసింది. పుష్ప పార్ట్ 2 మూవీ కేవలం 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసింది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ కి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: