మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ మనీ జెనీలియా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటువంటి బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తమిళ్ కంటే కూడా తెలుగు లో మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి బాయ్స్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు తెలుగు లో వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి.

అందులో భాగంగా ఈమె నటించినా ఎన్నో సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈమెకు బొమ్మరిల్లు సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో హాసిని పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అయినటువంటి రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది.

ఇకపోతే జెనీలియాకు పెద్ద మొత్తం లోనే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. జెనీలియా కు 6 మిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు 50 కోట్ల అని సమాచారం. ఇక తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ ఆస్తితో కలిపి జెనీలియాకు 22 మిలియన్ డాలర్ల వరకు అస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా జెనీలియా కు పెద్ద మొత్తం లోనే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు లో జెనీలియాకు బొమ్మరిల్లు సినిమాతో పాటు రామ్ పోతినేని హీరో గా రూపొందిన రెడీ , రామ్ చరణ్ హీరో గా రూపొందిన ఆరెంజ్ మూవీ లతో కూడా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: