టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో శ్రీకాంత్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఇక హీరోగా అవకాశాలను దక్కించుకున్నాక కూడా ఈయన మంచి విజయాలను అందుకుంటు చాలా సంవత్సరాల పాటు హీరోగా కెరియర్ను కొనసాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం శ్రీకాంత్ హీరో అవకాశాలు పెద్దగా దక్కడం లేదు. హీరోగా అవకాశాలు వచ్చిన ఆయన హీరోగా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కూడా కావడం లేదు. దానితో ఈయన కూడా రూటు మార్చి సినిమాల్లో కీలక , ముఖ్య , విలన్ పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్ ఏటీఎం అనే పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ కు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మొదట తన పాత్రకు ఎవరిని అనుకున్నారు. ఆ నటుడు ఎందుకు ఆ పాత్ర చేయలేదు అనే వివరాలను తెలియజేశాడు.

శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... చిరంజీవి హీరోగా రూపొందిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో నేను ఏటీఎం అనే పాత్ర చేశాను. ఆ పాత్రలో మొదటగా నన్ను కాకుండా పవన్ కళ్యాణ్ ను తీసుకోవాలి అని మూవీ బృందం వారు అనుకున్నారు. కానీ పవన్ ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు దానితో ఆ పాత్రకు నన్ను సంప్రదించారు అని శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: