సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అభిమానులను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలను కోల్పోవడం సోషల్ మీడియాలో సంచలనం అయింది. మహిళ మృతి కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా బన్నీ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే పబ్లిసిటీ పిచ్చి రేవతి ప్రాణం తీసిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
 
సంధ్య థియేటర్ దగ్గరకు పోలీసులు అల్లు అర్జున్ రావడానికి అనుమతులు ఇవ్వకపోయినా బన్నీ మాత్రం స్టేషన్ కు వచ్చారు. ఒకవేళ బన్నీ సంధ్య థియేటర్ దగ్గరకు రాకుండా ఉండి ఉంటే మాత్రం ఈ ఘటన జరిగేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ ఈ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
 
బన్నీ భవిష్యత్తు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా ఆ సినిమాలతో కూడా అల్లు అర్జున్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. బన్నీ తర్వాత మూవీ రిలీజవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. బన్నీ వేగంగా సినిమాల్లో నటిస్తానని చెబుతున్నా ఆ మాటను నిలబెట్టుకోవడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా పాన్ ఇండియా డైరెక్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్ప ది రూల్ ఓటీటీ రిలీజ్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది. బన్నీ 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బన్నీ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా బన్నీకి భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: