తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ను అందుకొని గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత కూడా వరుస పెట్టి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతున్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఈమె ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలలో కూడా హీరోయిన్గా నటించి వాటితో కూడా మంచి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె నటించిన ఓ సినిమా విడుదల అయ్యి 1000 కోట్లకి పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకనైనా పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు రష్మిక మందన. ఈమె ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంది. 

కొంత కాలం క్రితం రష్మిక "పుష్ప పార్ట్ 1" అనే పాన్ ఇండియా సినిమాలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. రష్మిక తాజాగా పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఇప్పటికే 1300 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: