చైతన్య శోభిత జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. చైతన్య శోభిత కాంబినేషన్ లో సినిమాలేవీ తెరకెక్కకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఈ జోడీకి ఎంతోమంది అభిమానులు అయ్యారు. చైతన్య శోభిత తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతన్య శోభిత గోరింటాకు కథ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
శోభిత మాట్లాడుతూ 2018 సంవత్సరంలో తొలిసారి నాగార్జున ఇంటికి వెళ్లానని అన్నారు. 2022 సంవత్సరం ఏప్రిల్ తర్వాత చైతన్యతో స్నేహం మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. 2022 సంవత్సరం ఏప్రిల్ నుంచి నాగచైతన్యను తాను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చారు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని నేను, చైతన్య కలిసి ఫుడ్ గురించి ఎక్కువగా అభిప్రాయాలను పంచుకున్నామని శోభిత కామెంట్లు చేశారు.
 
తెలుగులో మాట్లాడమని చైతన్య నన్ను తరచూ అడిగేవాడని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో మాట్లాడటం వల్ల మ బంధం మరింత బలపడిందని ఆమె అన్నారు. నేను ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటానని శోభిత పేర్కొన్నారు. నేను పెట్టే గ్లామర్ ఫోటోలు కాకుండా స్పూర్తివంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్ లను చైతన్య లైక్ చేసేవారని ఆమె చెప్పుకొచ్చారు.
 
నాగచైతన్య శోభిత కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా దర్శకనిర్మాతలు ఈ కాంబినేషన్ దిశగా అడుగులు వేయడం లేదు. నాగచైతన్య శోభితలలో ఎవరో ఒకరు చొరవ చూపితే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు చైతన్య ఇటు శోభిత రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. చైతన్య శోభిత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. నాగ  చైతన్య శోభిత ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: