దాంతో వారి కాంబోకు ఇంకాస్త సమయం పడేటట్టు కనబడుతోంది. ఈలోపు సదరు సినిమాకు సంబంధించి సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా సుకుమార్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గతంలో వారి కాంబోలో వచ్చిన రంగస్థలంకి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అయితే కొందరు రంగస్థలం 2 ఉంటుందనే అనుమానాన్ని సుకుమార్ ముందు వ్యక్తం చేయగా, సుక్కు ఆ రూమర్స్ ని కొట్టి పారేసారు. రంగస్థలం సినిమాకి ఎటువంటి సీక్వెల్ ఉండబోదని తేల్చి చెప్పేసారు. దాంతో వారి తదుపరి సినిమా రంగస్థలం మించి ఉండబోతుందా అనే ప్రశ్నకు సుకుమార్.. తప్పకుండా ఈసారి రంగస్థలం సినిమాని బీట్ చేస్తామని చెప్పుకు రావడంతో మెగాభిమానులు రాబోయే వారి కాంబోకోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ ఇపుడు బుచ్చిబాబు సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన "గేమ్ చేంజర్" మూవీ ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాపైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాతి కానుకగా, జనవరి 12వ తేదీన ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ఓ కీ రోల్ పోషించిన సంగతి విదితమే.