అసలు ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సింది. కానీ కొన్ని కారణాల చేత ఆగిపోతూ వచ్చింది. ఈ సినిమా సెట్స్ పై కి వచ్చి షూట్ మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ అవ్వాలంటే దాదాపు మూడేళ్లు పైనే పడుతుంది అంటున్నారు జనాలు . "గుంటూరు కారం" సినిమాతో లాస్ట్ గా తెరపై మనం మహేష్ బాబుని చూసాం. అయితే మళ్లీ మనం మహేశ్ బాబు ని తెర పై చూడాలి అంతే ఇంకొక మూడేళ్లు పడుతుంది. ఇలాంటి మూమెంట్లోనే ఓ స్పెషల్ న్యూస్ తెర పైన హల్చల్ చేస్తుంది.
రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ బాబు మరొక స్టార్ హీరో సినిమాలు కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఓ యంగ్ హీరో సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట. టోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్న తేజ సజ్జా నెక్స్ట్ సినిమాలో మహేష్ బాబు ఓ చిన్న పాత్రలో మెరవబోతున్నారట. ధమాకా దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో తేజ సజ్జ ఓ మూవీ కి కమిట్ అయ్యాడు. ఆ మూవీలో చిన్న స్పెషల్ క్యారెక్టర్ కోసం మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారట మూవీ మేకర్స్. మహేష్ బాబు కూడా తేజ సజ్జా పై ఉన్న ఇష్టంతో ఆ పాత్రను ఓకే చేశారట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అన్ని కుదిరితే రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ బాబును మనం ఈ సినిమాలో తెరపై చూడొచ్చు..!?