టాలీవుడ్ లో గత సంక్రాంతి కి పాన్ ఇండియ మూవీ గా వచ్చిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు .. ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జ కు పాన్ ఇండియా లెవెల్ లో భారీ గుర్తింపు వచ్చింది .. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన అమృత అయ్యర్ కి మాత్రం అనుకొనంత స్థాయి లో గుర్తింపు రాలేదని చెప్పాలి .. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ రిలీజ కు రెడీగా ఉంది ..
అల్లరి నరేష్ హీరో గా వస్తున్న ఈ సినిమా లో అమృత అయ్యర్ కు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించింది .. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్న అమృత .. ఇక తన పెళ్లి కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వటం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ఇక 2024 సంవత్సరం లో చాలామంది స్టార్స్ పెళ్లి చేసుకున్నారు .. అమృత పెళ్లి ఎప్పుడు ? అనే ప్రశ్న కు ఓ ఇంటర్వ్యూలు ఆమె అదిరిపోయే సమాధానం ఇచ్చింది ..
కచ్చితం గా 2025 లో పెళ్లి చేసుకుంటానని అమృత అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది .. అయితే చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తి ని తాను పెళ్లి చేసుకోబోతున్నానని .. ఓకే రంగంలో ఉంటే మనస్పర్థలు వస్తాయి వేరు వేరు రంగాల్లో ఉంటే మనస్పర్ధలు రావని ఆమె చెప్పుకు వచ్చింది .. ఇక దీంతో అమృత అయ్యర్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింద ని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . మరి అమృత ఎలాంటి వ్యక్తి ని పెళ్లి చేసుకుంటుందో చూడాలి .