మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో గ్లోబల్ స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. మరి రామ్ చరణ్ అయితే ఇప్పుడు తన క్రేజ్ ని మరింత స్థాయిలో పెంచుకుంటూ వెళ్తుండగా ఇప్పుడు అయితే మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ సాలిడ్ సోషల్ డ్రామా ని చేస్తున్నాడు. మరి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాతో ఖచ్చితంగా శంకర్ నుంచి తన రేంజ్ మాస్ కం బ్యాక్ ఇస్తారని గట్టి టాక్ ఉంది.ఇక ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో యంగ్ రోల్ లో శంకర్ చరణ్ కి ప్లాన్ చేసిన లుక్స్ చూసి ఫ్యాన్స్ కి అయితే గట్టి ట్రీట్ ఖాయం అన్నట్టుగా అనిపిస్తుంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే అర్థం అయింది.ఇదిలావుండగా ఉపేంద్ర యువి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్సి 16 దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నానని, చరణ్ చితక్కొడుతున్నాడని చెప్పిన వీడియో వైరలవుతోంది. 

మొత్తానికి ఒకే సాయంత్రం రెండు క్రేజీ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీనే. ఉదయం చిరంజీవిని మధ్యాహ్నం నాగబాబుని అల్లు అర్జున్ కలిసిన కాసేపటికే గేమ్ ఛేంజర్, ఆర్సి 16 తాలూకు అప్డేట్స్ వాళ్ళను సంతోషపరిచాయి. త్వరలోనే ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయి.ఇదిలావుండగా భారతీయుడు 2 డిజప్పాయింట్‌ అయినా నేపథ్యంలో గేమ్‌ ఛేంజర్ ఎలా ఉంటుందనే డౌట్‌ మెగా అభిమానుల్లో ఉంది.మరి నిజంగానే గేమ్‌ ఛేంజర్‌లో కంటెంట్‌ ఉందా? లేక హడావుడినే మిగిలిపోతుందా ? అనేది చూడాలి.కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫెయిల్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: