ఏ భార్యకైనా సరే తన భర్త ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది . తన భర్త ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించాలి అని కోరుకుంటుంది . స్నేహ రెడ్డి కూడా అంతే పార్ష్ గా  పెరిగిన ..మోడరన్ గా ఉంటున్న కూడా కొన్ని కొన్ని విషయాలలో మాత్రం అల్లు అర్జున్ అంటే ప్రాణం ఇచ్చేస్తుంది. అల్లు అర్జున్ కోసం ఎలాంటి పనైనా చేస్తుంది. ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకుంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తున్నాం .


మొదటగా మెగా ఫ్యామిలీతో విభేదాలు అని రావడం .. ఆ తర్వాత పుష్ప2 సినిమాను అడ్డుకుంటాం ..ప్లాప్ చేస్తామని రావడం.. ఆ తర్వాత పుష్ప2 సినిమా రిలీజ్ అయి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన అక్కడక్కడ నెగిటివ్ టాక్ రావడం ..ఇక ఫైనల్లీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం ..ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా అల్లు అర్జున్ కి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు స్నేహా రెడ్డి బన్నీకి వచ్చిన బ్యాడ్ నేమ్ అంతా కూడా తుడిచిపెట్టుకు పోయేలా చేయబోతుందట.



ఆమె 41 రోజుల పాటు ఒంటి పూట ఉపవాసం ఉండబోతుందట. అది కూడా ఆమె బాగా నమ్మె వెంకటేశ్వర స్వామి కోసం . అంతేకాదు 41 రోజులపాటు నిత్య వెంకటేశ్వర స్వామి నామాలతో పూజలు కూడా చేయబోతుందట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. భర్త హ్యాపీగా ఉండడానికి ఏ భార్య ఏమైనా చేస్తుంది అని ..స్నేహారెడ్డి కూడా అలానే చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు బన్నీ అభిమానులు. అంతేకాదు మా వదినమ్మ సూపర్ అంటూ మాట్లాడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: