ఈ సినిమాని కన్నా ముందే పవన్ కళ్యాణ్ నుంచి తొలి పాన్ ఇండియా సినిమాగా వస్తున్న హరిహర వీర మల్లు సినిమాను దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టాడు .. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు దాటుతున్న.. ఇప్పటికీ ఈ షూటింగ్ కంప్లీట్ కాలేదు .. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారటం తో ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది .. ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఏం రత్నం ఈ సినిమాను వచ్చే సమ్మర్ కనకగా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించాడు .. అలాగే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు వచ్చింది .. మరో రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది ..
ప్రస్తుతం ఈ సినిమాకు ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా ఈ సినిమాను తెర్కక్కిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగల్ ఎప్పుడు నుంచో రిలీజ్ కి వస్తుందన్న టాక్ ఉంది .. ఇప్పుడు ఫైనల్ గా ఈ సాంగ్ పై మళ్లీ వార్తలు వస్తున్నాయి .. జనవరి 1 నూతన సంవత్సరం కానుకగా ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సాంగ్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడింది కావటం విశేషం .. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మించారు .. మార్చ్ 28న హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్‌లొ ప్రేక్షకుల ముందుకు రానుంది.