అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి రికార్డులను తిరగరాస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రష్మిక మందన హీరోయిన్గా అద్భుతంగా నటించింది. శ్రీలీల ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ సరసన స్టెప్పులు వేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.


పుష్ప-2 సినిమా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 1500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉండగా.... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడట. వచ్చే సంవత్సరం ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.


గురూజీ ఈసారి తన రొటీన్ ఫార్మేట్ కథలను పక్కనపెట్టి అల్లు అర్జున్ తో పాన్ ఇండియా ఇమేజ్ ని బేస్ చేసుకుని ఈ సినిమా కథను రాసుకున్నారట. మైథలాజికల్ టచ్ ఉన్న కథగా ఈ సినిమాలో తీయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెలువడలేదు. ఈ సినిమాలో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.


ఆ సినిమాలో అల్లు శిరీష్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఆ పాత్ర కోసం ఎవరైనా కొత్త నటుడిని పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించారట. కానీ ఫైనల్ గా అల్లు శిరీష్ ని పెట్టి తీయాలని అనుకున్నారట. ఇక ఆ పాత్ర గురించి అల్లు శిరీష్ కి చెప్పడంతో వెంటనే అతడికి నచ్చి ఓకే చెప్పేశారట. ఇక ఈ సినిమాలో అల్లు కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు స్క్రీన్ మీద కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: