తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ కి షాక్ ఇవ్వబోతున్నారా.. అదే నిజమైతే బెయిల్ రద్దు చేయడం ఖాయం..మళ్ళీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు చాలామంది. మరి ఇంతకీ బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ కి పోలీసులు ఎలాంటి షాక్ ఇచ్చారు.సంధ్య థియేటర్ పై పోలీసులు బయటపడిన రిపోర్ట్ కారణంగా బన్నీకి ఎలాంటి షాక్ తగలబోతుంది..ఒకవేళ అది నిజమే అయితే బన్నీ బెయిల్ రద్దయి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా..ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు.తెలుసుకుందాం.. పుష్ప -2 రిలీజ్ అయిన రోజు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి మృతికి సంబంధించిన కేసులో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయ్యి ఆయన్ని నిందితుడిగా చేర్చి చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

 ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నిమిషంలోనే ఈ వార్త మీడియా మొత్తం వైరల్ అయింది. నేషనల్ అవార్డు విన్నర్ ని పై ఇలాంటి నేర ఆరోపణలా అని ఎంతో మంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు బన్నీ అరెస్టుని ఖండించారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సెలెబ్రెటీలు స్పందించి నేరం ఒక్కరిపై రుద్దేయడం న్యాయం కాదు అంటూ పోస్టులు పెట్టారు. అలాగే అల్లు అర్జున్ అరెస్టుతో గత కొద్ది రోజులుగా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవలు కూడా ఒక అరెస్టుతో చల్లారిపోయాయి. అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన తర్వాత చిరంజీవి,నాగబాబు బన్నీ ఇంటికి వెళ్లారు.అలాగే అల్లు అర్జున్ జైలు నుండి బయటికి వచ్చాక చిరంజీవి, నాగబాబులను ఇంటికి వెళ్లి మరీ కలిసొచ్చాడు.

అలాగే అల్లు అర్జున్ ఇంటికి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వచ్చి బన్నీని పరామర్శించారు. ఇక ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వెళ్లడానికి వీల్లేదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చినట్లు ఒక రిపోర్ట్ నిన్న వైరల్ అయింది. అయితే అది నిజమైతే గనుక అల్లు అర్జున్ కి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్ళీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు. మరి పోలీసులు బయటపెట్టిన ఈ రిపోర్ట్ నిజమేనా..అందులో ఎంత నిజం ఉంది.. ఒకవేళ అది నిజమైతే మళ్ళీ అల్లు అర్జున్ జైలుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: