అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 11 రోజులు అయినా కూడా బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. 11 రోజుల్లోనే 1400 కోట్లకు పైగా రాబట్టింది. లాంగ్ రన్‌లో ఈ చిత్రం 2000 కోట్ల మార్క్‌ను టచ్ చేసేలా ఉందని అంతా అనుకుంటున్నారు. ఇక ఇండియాలో ఇప్పటి వరకు పుష్ప 2 కేవలం దంగల్, బాహుబలి 2 రికార్డుల్ని మాత్రం బద్దలు కొట్టలేదు. మిగిలిన అన్ని చిత్రాల రికార్డుల్ని పుష్ప 2 లేపి అవతల పారేసింది.ఇదిలావుండగా తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సంయుక్త తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని వీక్షించినట్టుగా చెప్పింది. అసలు ఈ మధ్య పుష్ప 2కి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2లోని జాతర సీన్లకు కొంత మందికి నిజంగానే పూనకాలు వచ్చేస్తున్నాయి. బన్నీ పర్ఫామెన్స్ చూసి ఊగిపోతోన్నారు. అలానే నటి సంయుక్తకి కూడా అలాంటి ఘటనే ఎదురైందట. పుష్ప 2 సినిమాకి వెళ్తే జాతర సీన్‌కి పక్కన ఉన్న మహిళ సామీ అంటూ బిగ్గరగా అరిచేసిందట. దెబ్బకు భయపడిపోయిందట.సంయుక్త వేసిన ఈ పోస్ట్ మీద ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. ఫోనిక్స్ మాల్‌లో పుష్ప 2 చూశా జాతర సీన్ స్టార్ట్ అవ్వడం, చీరలో హీరో డ్యాన్స్ వేయడంతో నా పక్కనే ఉన్న మహిళ పూనకం వచ్చినట్టుగా చేసింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు.. దీంతో దెబ్బకు భయం వేసి పది రూపాయల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా అని చెప్పింది.ఆమె చెప్పిన మ్యాటర్ అంతా వదిలేసి జనాలు మాత్రం పది రూపాయల టికెట్‌ను పట్టుకున్నారు. అసలు ఆ మాల్‌లో పది రూపాయల టికెట్ ఎక్కడ ఉందని స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావ్.. పది రూపాయల టికెట్ ఎప్పుడో రద్దు అయింది.. ఇప్పుడు ఎక్కడా కూడా ఆ ధరకు టికెట్లు అమ్మడం లేదు కదా అంటూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: