సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటా మరోసారి విభేదాలు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గురించి గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయితే మరోసారి ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు నెలకొన్నాయి. ఇటీవల మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవలు అంతా ఇంత కాదు. అయితే వారి గోడవలను కవర్ చేసేందుకు వచ్చి టీవీ 9 చానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ చేతిలోంచి మైక్ ను లాక్కొని ఆ మైక్ తో రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేశారు.
గాయపడిన రిపోర్టర్ రంజిత్ కుమార్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి రంజిత్ కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి.. దాడి జరిగిన రోజు తప్పు తనదేనని మోహన్ బాబు ఒప్పుకున్నారు. రంజిత్ తో పాటు అత‌ని కుటుంబ సభ్యులకు కూడా మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మెహ‌న్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జ‌ర్నలిస్ట్ రంజిత్‌ను క‌లిసి ప‌ర‌మ‌ర్శించడం జరిగింది.

రిపోర్టర్ పై దాడి చేసినందుకు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది.  అయితే మోహన్ బాబు అరెస్ట్ పై రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసాం. వీటిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. మోహన్ బాబు కు నోటీస్ ఇచ్చాం. ఆయన 24 వ తేదీ వరకు సమయం అడిగారు. కోర్టు కూడా మోహన్ బాబు కు 24వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. అలాగే ఆయన దగ్గర ఉన్న రెండు గన్స్ ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.  ఈ క్రమంలో పోలీసులు త‌న లైసెన్స్ గ‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికే ఒక గన్‌ను మోహన్ బాబు చంద్రగిరిలో సరెండర్‌ చేయడం జరిగింది. ఇంతలోనే నేడు మోహన్‌బాబు ఫ్యామిలీ గన్స్‌ ని కూడా ఫిలింనగర్‌ పీఎస్‌లో పోలీసులు సీజ్‌ చేశారు. దీంతో పోలీసులు మోహన్ బాబు ని వదలకుండా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: